NTV Telugu Site icon

Kadapa Polling: మహిళల్లో పోటెత్తిన చైతన్యం.. ఉమ్మడి కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్..

Kadapa

Kadapa

Kadapa: కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, ట్రాన్స్ జెండర్ 3 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం ఓట్లు 2,10, 241 పోల్ అయ్యాయి. దాదాపు 86. 68 శాతం కంప్లీట్ అయినది అని ఈసీ పేర్కొనింది.

Read Also: Uttarpradesh : కుక్కను ఎవరు చంపారో చెప్పండి.. రూ.50వేల గిఫ్ట్ పట్టండి

ఇక, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 81.34 శాతం మేర ఓట్లు పోలైన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 11727 ఉండగా.. మహిళలు 1,17941 ఓట్లు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ జెండర్లు 19 ఓట్లు కూడా ఉన్నాయి. ఇక, మొత్తం 2,29,687 ఓట్లు ఉండగా.. అందులో పురుషులు 91, 484 ఓట్లు, మహిళలు 95, 339 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలైయ్యాయి. ఇక, 10 మంది ట్రాన్స్ జెండర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు, మొత్తం 1, 86, 833 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 81.34 శాతంగా ఎన్నికల అధికారులు నిర్ధారించారు.

Read Also: Collector Dilli Rao: స్ట్రాంగ్ రూమ్స్ కి సీల్ వేశాం.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం..!

అలాగే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 79. 68 శాతం ఓట్లు పోలైయ్యాయి. కేవలం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 19, 985 ఉండగా.. మహిళలు 1, 27 , 933 ఓట్లు ఉన్నాయి. ఇక, 48 మంది ట్రాన్స్ జెండర్లు ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,47,966 ఉన్నాయి.. ఇందులో పురుషులు 95,338, మహిళలు 1,02,226, ట్రాన్స్ జెండర్ లు 27 ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 1,97,591 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 79. 68 శాతంగా ఉందని ఈసీ వెల్లడించింది.