Dutch Man : పుట్టించిన తల్లిదండ్రులంటే ఎవరికి ప్రేమ ఉండదు. 9నెలలు కడుపులో పెట్టుకుని బయట ప్రపంచానికి పరిచయం చేసేది తల్లి. తల్లి 9నెలలు మోస్తే.. తండ్రి జీవితాంతం మోస్తాడు. పిల్లలను ఓ స్థాయి వరకు తీసుకొచ్చి.. వారి కాళ్ల మీద వార నిలబడే వరకు కంటికి రెప్పలా కాపాడుతాడు తండ్రి. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేము. అలాంటి తండ్రి మీద ఎవరికైనా ప్రేమే ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నాన్నే రోల్ మోడల్. నాన్నతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపాలని చాలామంది అనుకుంటారు. నాన్న కనపడకపోతే చాలామందికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అంతగా మనమంతా నాన్నపై డిపెండై ఉంటాం. అలాంటి నాన్న శాశ్వతంగా దూరమైతే ఆవేదనకు హద్దులు ఉండవు. ఆ బాధ మాటల్లో చెప్పలేము.అలాగే ఓ కొడుకు తన తండ్రి మృతిని తట్టుకోలేక.. అతడి మృతదేహాన్ని ఏడాదిన్నర పాటు ఫ్రిజ్ లో పెట్టి దాచుకున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. విషయం వెలుగులోకి వచ్చి ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే తండ్రితో మాట్లాడాలని అలా చేశానని చెప్పాడు. మరణించిన వ్యక్తి కొడుకు వయసు 82 కావడం విశేషం..
Read Also:Theft: పెండ్లి ఇంట్లో భారీ చోరీ.. 11 లక్షలతో ఉడాయించిన దొంగలు
వివరాల్లోకి వెళితే.. నెదర్లాండ్‌లోని ల్యాండ్‌గ్రాఫ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఓ డచ్ వ్యక్తి (82).. తన తండ్రి 101 ఏళ్ల వయసులో వయోభారంతో మరణించాడు. ఐతే తండ్రి మరణించి 18నెలలవుతున్నా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించ లేదు. ఎవరికీ తెలియకుండా ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆ కుటుంబం ఫ్యామిలీ డాక్టర్ పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉండటాన్ని గమనించారు. ఫ్రిడ్జ్ లో మృత దేహాన్ని భద్రపరచడంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Also:Andhrapradesh: ప్రెగ్నెంట్లకు ఏపీ సర్కారు గుడ్‌న్యూస్.. ఆ సేవలు ఉచితం
పోలీసులు ఆ వ్యక్తిని ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నావని ప్రశ్నించగా.. తన తండ్రిని చాలా మిస్సవుతున్నానని, తన తండ్రితో మాట్లాడకుండా, చూడకుండా ఉండలేనని, అందుకే 18 నెలలుగా తండ్రి డెడ్ బాడీని ఫ్రిజ్‌లో భద్రపరచినట్లు సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. ఇప్పటికీ రోజూ తండ్రితో మాట్లాడుతున్నానని అతను చెపుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తండ్రి మృతికి సంబంధించి కొడుకుపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. 82 ఏళ్ల కొడుకు స్వతహాగా పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడని, ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయని విచారణాధికారులు తెలిపారు. చాలా ఏళ్లుగా ట్యూమర్‌తో బాధపడుతున్న తండ్రిని తరచూ ఆస్పత్రికి కూడా తీసుకెళ్తారని పొరుగువారు చెబుతున్నారు. వారం తర్వాత విచారణ కొనసాగిస్తామరి పోలీసులు తెలిపారు.