Site icon NTV Telugu

Ganja Seized : మెదక్‌లో 800 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

Ganja In Hydrabad

Ganja In Hydrabad

Ganja Seized : మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలోని ఆర్‌టీఏ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి భారీ ఎత్తున గంజాయి తరలిస్తుండగా, పూణె , గోవా రాష్ట్రాల డిఆర్‌ఐ స్పెషల్ ఫోర్స్ అధికారులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా చెక్‌పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్‌ఐ అధికారులు , చెక్‌పోస్ట్ సిబ్బంది చాలా సేపు వేచి చూశారు, కానీ డ్రైవర్ తిరిగి రాకపోవడంతో లారీని చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ లారీని తనిఖీ చేయగా, 800 క్వింటాళ్ల గంజాయి సంచులు లభించాయి. ముంబైలో ఈ గంజాయి ఎవరికి సరఫరా చేయాలనుకున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.

Allu Arjun : బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ ఈరోజు జైల్లోనే ఉండాలా?

Exit mobile version