స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలేం. అప్పటి దాకా లాభాల్లో ఉన్న సంస్థలు కాస్త పలు కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదే ఇప్పుడు జరిగింది. తాజాగా మాజీ ఇన్వెస్టర్ దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా సోమవారం ఒక్క రోజే 800 కోట్లు నష్టపోయారు. టైటాన్ కంపెనీకి చెందిన షేర్లు పడిపోవడంతో ఆమెకు ఆ నష్టం వాటిల్లింది. టాటా గ్రూపు కంపెనీకి చెందిన టైటాన్ సంస్థలో ఝున్‌ఝున్‌వాలాకు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి. రేఖా ఝున్‌ఝున్‌వాలాకు సుమారు 5.35 శాతం వాటా ఉంది. ఆమె వాటా విలువ సుమారు రూ.16,792 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచానా.
READ MORE: Rafah crossing: రఫా క్రాసింగ్ లోని పాలస్తీనా భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
సోమవారం రోజున టైటాన్ కంపెనీకి చెందిన షేర్లు ఏడు శాతం పడిపోవడం వల్ల ఆమెకు భారీ నష్టం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఆ కంపెనీ షేర్ విలువ రూ.3,352 నుంచి రూ.3,281.65కు పడిపోయింది. కంపెనీ విలువ రూ. మూడు లక్షల కోట్ల నుంచి రూ. రెండు లక్షల 91 వేలకు పడిపోయింది. దీంతో రూ.22 వేల కోట్ల నష్టం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రేఖా జున్‌జున్‌వాలా వాటా రూ.15,986 కోట్ల పడిపోయినట్లు మార్గెట్ వర్గాలు తెలిపాయి. గత వారం చివరిలో టైటాన్ కంపెనీ తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మార్కెట్ అంచనాలను నాలుగో త్రైమాసికంలో కంపెనీ అందుకోవటంలో విఫలం అవ్వటంతో టైటాన్ స్టాక్ పతనానికి గురైంది. ఆభరణాల వ్యాపారంలో కొనసాగుతున్న ఒత్తిడి, పెరిగిన పోటీ, అధిక ధరలతో తగ్గిన డిమాండ్ వంటి సమస్యలు మార్చి త్రైమాసిక లాభాలను తగ్గించాయని నిపుణులు చెబుతున్నారు.
టైటాన్ కంపెనీ, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్,