హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని సనత్ నగర్ లో ఎనిమిదేళ్ల బాలుడి హత్య కలకలం రేపుతుంది. నిన్నటి ( గురువారం ఏప్రిల్ 20 ) నుంచి కనిపించకుండా పోయిన అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం ఇంటికి సమీపంలోని నాలాలో కుటుంబ సభ్యులు గుర్తించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హిజ్రా ఇంటిపై మృతుడి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ట్రాన్స్ జెండర్ ఇంటిలో క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లను గుర్తించారు.
Also Read : Ram Charan: 100 మంది కాదు షేర్‌ఖాన్.. ఈసారి 1000 మందితో…
అయితే నిన్న అమావాస్య రోజున ఎనిమిదేళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ ను హిజ్రా నరబలి ఇచ్చినట్లుగా మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నీళ్ల బకెట్ లో ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను ముంచి హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలోని నాలాలో వేశారు. మృతదేహాన్ని నాలాలో వేసేందుకు డబ్బాలో తీసుకెళ్తున్న వీజువల్స్ సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయ్యాయి. అబ్దుల్ వహీద్ ను నరబలి ఇచ్చారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను హత్య చేసిన ట్రాన్స్ జెండర్ ఇమ్రాన్ ను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తు్న్నారు. దీంతో సనత్ నగర్ లో ఘటన కలకలం రేపుతుంది. బాలుడుని నరబలి ఇచ్చారనే వార్తలో ఒక్కసారిగా అక్కడి ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read : Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
బాలుడి హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి వసీంఖాన్.. ఫిజాఖాన్ (హిజ్రా) వద్ద చిట్టీ గొడవ హత్య కారణంగా బాలున్ని చంపినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఈ తరుణంలోనే, వసీం ఖాన్ కొడుకును నలుగురు కిడ్నాప్ చేసి, హిజ్రా ఇంటికి తీసుకొని పోయారు. కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు వసీంఖాన్. బాలుడిని చంపి ఎముకలు విరిచి, బకెట్లో కుక్కిన నిందితులు.. అనంతరం.. బాలుడి మృతిదేహాన్ని పక్కనే ఉన్న నాలాలో పడేశారు. అయితే.. ఈ కేసును చేధించిన పోలీసులు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
