బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కతిహార్ జిల్లాలో కారు, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులోని ప్రయాణికులు వివాహ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా NH-31లోని సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ పురుషులేనని, వారు ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్నారని కతిహార్ పోలీస్ ఎస్పీ వైభవ్ శర్మ పిటిఐకి తెలిపారు. ముందు నుంచి వస్తున్న ట్రాక్టర్ ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.
Also Read:Off The Record: ఆ మాజీ మంత్రి అంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారట! జరదూరం అనే ట్యాగ్
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎనిమిది మంది మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతులందరూ సుపాల్ జిల్లా నివాసితులుగా చెబుతున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.