Mumbai: తుఫాన్ బీభత్సం.. హోర్డింగ్ కూలి 8 మంది మృతి, 59 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుమ్ము తుఫాన్ ముంబైని వణికించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా తీవ్ర అలజడి సృష్టించింది. భారీ ఈదురుగాలులు వీయడంతో భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దీంతో 8మంది మృతి చెందారు. మరో 59 మందికి గాయాలయ్యాయి. ఘాట్‌కోపర్‌లోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: SBI BANK: చరిత్ర సృష్టించిన ఎస్బీఐ ఇండియా.. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్లో చేరిన తొలి బ్యాంక్..
Also Read
సోమవారం సాయంత్రం ముంబైలోని ఘాట్‌కోపర్‌లో బలమైన దుమ్ము తుఫాను కారణంగా ఇంధన స్టేషన్‌పై భారీ బిల్‌బోర్డ్ కూలిపోయింది. ఒక్కసారిగా కూలడంతో శిథిలాల కింద డజన్ల కొద్దీ ప్రజలు చిక్కుకున్నారన్నారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 59 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బిల్ బోర్డు పెట్రోల్ బంక్‌కు ఎదురుగా ఉంది. కూలిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనేకా కార్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈదురుగాలుల ప్రభావంతో మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. అలాగే విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు, ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక… భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: KTR: పార్లమెంట్ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు వస్తాయి..
ధూళితో కూడిన తుఫాన్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో వాహనదారులు.. తలదాచుకునేందుకు ప్రయత్నించగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఓ వైపు ధూళి తుఫాన్.. ఇంకోవైపు భారీ వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం పడింది.
#WATCH | Maharashtra | 35 people reported injured after a hoarding fell at the Police Ground Petrol Pump, Eastern Express Highway, Pantnagar, Ghatkopar East. Search and rescue is in process: BMC
(Viral video confirmed by official) https://t.co/kRYGqM61UW pic.twitter.com/OgItizDMMN
— ANI (@ANI) May 13, 2024
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్‌కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్‌కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!