Site icon NTV Telugu

Pahalgam terror attack: భారత్ వీడిన 786 మంది పాక్ జాతీయులు..

Pak

Pak

పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్య దాడికి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువునిచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని ‘లీవ్ ఇండియా’ నోటీసు నుంచి మినహాయించారు. స్వల్పకాలిక వీసాల 12 వర్గాలలో దేనినైనా కలిగి ఉన్న పాకిస్తానీయుల గడువు ఆదివారంతో ముగిసింది.

Also Read:Mariyam Nawaz: ‘పాకిస్తాన్ సైన్యానికి అల్లా బలాన్ని ఇచ్చాడు.. భయపడాల్సిన అవసరం లేదు.. మరియం బెదిరింపులు

ఏప్రిల్ 24 నుంచి ఆరు రోజుల్లో 786 మంది పాకిస్తాన్ జాతీయులు అట్టారి-వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా భారత్ ను విడిచి పాక్ కు బయలుదేరారని సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో, మొత్తం 1,376 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారని అధికారి తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తరువాత పాకిస్తాన్ జాతీయుల బసపై నిషేధం విధించింది. పాకిస్తాన్ కు ప్రయాణించవద్దని భారత పౌరులకు ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి రావాలని సూచించారు.

Also Read:Tirupati : వేసవి సెలవులకు అనుకూలంగా 8 స్పెషల్ ట్రైన్లు..

పాకిస్తాన్‌కు నేరుగా విమానాలు లేకపోవడంతో చాలా మంది దుబాయ్ లేదా ఇతర మార్గాల ద్వారా విమానంలో వెళ్లిపోయారు. రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలు దేశంలోని వివిధ ప్రదేశాలలో నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను గుర్తిస్తుండటంతో మరింత మంది పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్తారని ఓ అధికారి తెలిపారు. కేంద్ర నిఘా సంస్థలతో సన్నిహిత సమన్వయంతో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వెరిఫికేషన్ డ్రైవ్ జరుగుతోంది. పాకిస్తాన్ జాతీయులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏప్రిల్ 29 తర్వాత కూడా వారు భారత్ లో ఉంటే చర్యలు తప్పవని మరో అధికారి తెలిపారు.

Exit mobile version