పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్య దాడికి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువునిచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని ‘లీవ్ ఇండియా’ నోటీసు నుంచి మినహాయించారు. స్వల్పకాలిక వీసాల 12 వర్గాలలో దేనినైనా కలిగి ఉన్న పాకిస్తానీయుల గడువు ఆదివారంతో ముగిసింది. Also…