NTV Telugu Site icon

Anna Canteens: రెండో విడతలో 75 అన్న క్యాంటీన్ల ప్రారంభం..

Anna Canteen

Anna Canteen

రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సెక్రటేరీయేట్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెండో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్, గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లల్లో టోకెన్లు తీసుకుని పేదలకు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పేదలకు భోజనం వడ్డించారు. తర్వాత.. సీఎం చంద్రబాబు పేదలతో ఇంటరాక్ట్ అయ్యారు. భోజనం ఎలా ఉందంటూ అడిగారు.
పేదలకు ప్రభుత్వం చక్కటి భోజనం పెడుతోందని మహిళలు తెలిపారు.

Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీని టెర్రరిస్టు అన్న కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం.. ఇదో పవిత్ర కార్యక్రమం అని అన్నారు. పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ పథకాన్ని ప్రారంభించాం.. పరిశుభ్రమైన, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.15తో మూడు పూటల అన్నం పెట్టే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ప్రతి అన్న క్యాంటీన్లల్లో భోజనం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. మరోవైపు.. వరద సాయం కోసం చిన్నారులు మొదలుకుని చాలా మంది విరాళాలు ఇచ్చారని అన్నారు. మంచికి స్థానం ఉందని దాతలు నిరూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి.. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలి.. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు.

Read Also: Thota Trimurthulu: జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?

ఈ ఖర్చును ప్రభుత్వం భరించగలదు.. కానీ ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంచేలా చేయడం కోసం విరాళాలు అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్ల మీద కూడా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి.. సేవా కార్యక్రమాల పైనా ఈ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. సేవా భావంతో పని చేసే కార్యక్రమాలను విమర్శలు చేయడం దివాలాకోరుతనమే అని తెలిపారు. ఏపీ చేపట్టిన వరద సహయక చర్యలను దేశం మొత్తం గుర్తించిందని సీఎం పేర్కొన్నారు. మరోవైపు.. జల్ జీవన్ మిషన్ స్కీంను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ మాత్రం జల్ జీవన్ మిషన్ వినియోగించుకోలేకపోయింది.. జల్ జీవన్ మిషన్ స్కీంను వినియోగించుకోకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారని దుయ్యబట్టారు.