Site icon NTV Telugu

Road Accident: రోడ్ డివైడర్ పైకి దూసుకెళ్లిన మినీ బస్సు .. 7 మహిళలు మృతి

Accident

Accident

ఊహలకందనివే వాస్తవాలని ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు.. మరణం రాసిపెట్టి ఉంటె ఎవరు తప్పించుకోలేరు అని తరుచు మన పెద్దలు అంటుంటారు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి క్షణాల్లో మన కళ్ళ ముందే చనిపోయిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. అప్పటి వరకు తోటివారితో సరదాగా మాట్లాడుకుంటున్న ఆ మహిళలని మృత్యువు కాటేసింది. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది..

Read Also: Colombo Weather: రిజర్వ్‌ డేకు కూడా వర్షం ముప్పు.. టీమిండియాను కలవరపెడుతున్న బ్యాడ్‌లక్‌!

వివరాలలోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపాన చండీయార్ దగ్గర వాహనం ఆగివున్న మినీ బస్సుని ఢీకొన్నది. దీంతో మినీ బస్సు రోడ్ డివైడర్ పై కూర్చున్న మహిళల పైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో క్షతగాత్రులని చికిత్స కోసం తిరుపత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే యాంగిల్ లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా ఈ సంఘటన అందరిని కలిచి వేస్తుంది.. అప్పటివరకు సరదాగా మాట్లాడిన వాళ్ళు కళ్ళ ముందే విగత జీవులుగా మారడం బాధాకరంగా మారింది.

Read Also:Crime: ఏంటి గుడి దగ్గర మూత్ర విసర్జన చేయొద్దని చెప్పినందుకు చంపేస్తారా..!

Exit mobile version