Age Difference : ప్రేమ విషయంలో వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య. ఎందుకంటే ప్రేమలో వయో పరిమితి లేదా కుల వివక్ష ఉండదు. నిజమైన ప్రేమ అందరినీ జయిస్తుంది అని ఈ అద్భుతమైన జంటలు ప్రపంచానికి నిరూపించారు. వయసులో చాలా తేడా ఉన్న ప్రేమతో తమ జీవిత భాగస్వామిని సొంతం చేసుకున్న సెలబ్రిటీ జంటల గురించి తెలుసుకుందాం.
ప్రముఖ బాలీవుడ్ నటి సైరా బాను మనవరాలు అయిన సయేషా సైగల్ మార్చి 10, 2019న తమిళ సూపర్ స్టార్ ఆర్యను వివాహం చేసుకున్నారు. గజినీకాంత్ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ జంట డేటింగ్ చేసుకున్నారు. 2021 లో ఈ జంట ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జంటకు 17 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. కానీ వారి సంబంధాన్ని ప్రభావితం చేసే ట్రోల్ లేదా విమర్శలు ఎప్పుడూ పట్టించుకోరు.
1999లో అమర్కలం సినిమాలో ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు అజిత్ తన భార్య షాలినిని కలిశారు. 8 సంవత్సరాల వయస్సు అంతరం కారణంగా, ప్రజలు వారి సంబంధం గురించి చాలా మాట్లాడుకున్నారు. అయినప్పటికీ, అజిత్ పట్టించుకోలేదు. షాలినిని పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ ఏప్రిల్ 2000లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట ఇద్దరు పిల్లలుకు జన్మనిచ్చి సంతోషంగా ఉన్నారు.
Read Also: YSR Congress Party: నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది?
టాలీవుడ్ నవ మన్మథుడుగా పిలుచుకునే అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున 11 జూన్ 1992న అమలను వివాహం చేసుకున్నాడు, అయితే ఆయనది మొదటి వివాహం కాదు, ఎందుకంటే అతను తన మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటికి విడాకులు ఇచ్చాడు. నాగార్జున, అమల గురించి చెప్పాలంటే వారి వయస్సులో 9 సంవత్సరాల తేడా ఉంది. అయినప్పటికీ ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంది.
హిందీ, సౌత్ చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరొందిన నటుడు ప్రకాష్ రాజ్ తనకన్నా 12 సంవత్సరాలు చిన్నదైన స్నేహితురాలు పోనీ వర్మను 45 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఆగస్టు 24, 2010న పెళ్లి చేసుకోని.. 2015లో ఒక కొడుకుకు తల్లిదండ్రులు అయ్యారు.
Read Also:
మలయాళ నటి నజ్రియా నజీమ్ తన కలల రాకుమారుడు ఫహద్ ఫాసిల్‌ను ఆమె 19 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. ఫహద్ వయస్సు అప్పుడు 32. ఈ జంట మధ్య 13 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంట 2014 లో పెళ్లి చేసుకున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కంటే 4 సంవత్సరాలు సీనియర్ అయిన బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్‌ను వివాహం చేసుకున్నాడు. వయసు, కులం, సమాజం పట్టించుకోకుండా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మీ ప్రణతి మధ్య వయసులో తొమ్మిదేళ్ల వ్యత్యాసం ఉంది.వారిద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మ నిచ్చారు.
