Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 65 Years Old Man Walked 600 Km And Reached His Hometown In Odisha

600KM Walk: 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్న వృద్ధుడు!

Published Date :July 30, 2024 , 8:02 am
By Sampath Kumar
  • 65 ఏళ్ల వృద్ధుడు సాహసం
  • 14 రోజుల పాటు 600 కిమీ
  • దళారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్‌
600KM Walk: 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్న వృద్ధుడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Odisha Old Man walks 600 KM from Hyderabad: ప్రస్తుత రోజుల్లో యువకులు కూడా పట్టుపని పది కిలోమీటర్లు నడవలేరు. అంతెందుకు 250-500 మీటర్ల దూరంలో ఉన్న షాప్ వెళ్లేందుకు కూడా బైక్ తీసుకెళుతుంటారు. అలాంటిది ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్నాడు. వెళ్లిన చోట పని దొరక్కపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఆ వృద్ధుడు కాలి నడకన ప్రయాణించాడు. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని నవరంగపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…

నవరంగపూర్‌ జిల్లా కొసగుముడా సమితి డుమరబెడ గ్రామానికి చెందిన 65 ఏళ్ల సోను బొత్రకు కొడుకు, కుటుంబం ఉంది. అయినా కూడా తాను ఏదైనా పని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దళారి సాయంతో 17 రోజుల క్రితం కూలి పనుల కోసం హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఓ ఇటుక బట్టీ యజమాని బొత్రను చూసి.. వయసు ఎక్కువగా ఉందని, పనిలో పెట్టుకోలేనని చెప్పాడు. ఎంత బ్రతిమిలాడినా అతడు ఒప్పుకోలేదు. చివరకు రూ.200 ఇచ్చి ఇంటికి వెళ్లిపోమని చెప్పాడు.

Also Read: Kerala News: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురి మృతి! శిథిలాల కింద వందలాది మంది

పని దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సోను బొత్ర.. 14 రోజుల క్రితం స్వగ్రామం డుమరబెడకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో కాలి నడకన బయలుదేరాడు. దారిలో ఎవరైనా భోజనం పెడితే తింటూ.. అలసిపోయిన చోట విశ్రాంతి తీసుకుంటూ 600 కిలోమీటర్లు నడిచాడు. చివరకు సోను బొత్ర సోమవారం మాలిగూడ చేరుకున్నాడు. అక్కడ చాలా నీరసించిన బొత్రను చూసిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు అతడిని స్వగ్రామానికి ఆటోలో తీసుకెళ్లారు. పని ఇప్పిస్తామని తీసుకెళ్లి మోసం చేసిన దళారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 600 KM Walk
  • 600KM Walk Old Man
  • hyderabad
  • Kosagumuda
  • Odisha

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions