Kabul Suicide Blast: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కొద్ది దూరంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని ఆఫ్ఘన్ దళాలు గుర్తించాయి. ఈ పేలుడులో ఆరుగురు పౌరులు చనిపోయారని.. అనేక మంది గాయపడ్డారని అంతర్గత మంత్రిత్వ శాఖ అబ్దుల్ నఫీ టాకోర్ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం సమీపంలోని వ్యాపార కేంద్రం ముందు ఈ పేలుడు సంభవించింది.
సోమవారం నాటి పేలుడు కాబూల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో మూడు నెలల్లోపు జరిగిన రెండో దాడి కాగా.. ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైన తర్వాత ఇది మొదటిది కావడం గమనార్హం. గతంలో జనవరిలో కూడా కాబూల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మందికి పైగా మరణించారు. కాబూల్‌లోని మిలిటరీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన పేలుడులో కనీసం 10 మంది మరణించిన మూడు రోజుల తర్వాత ఈ పేలుడు సంభవించింది. దేశంలోని మెరుగైన భద్రతా మౌలిక సదుపాయాల గురించి తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వాదనలను పునరావృతమయ్యే పేలుళ్లు బహిర్గతం చేస్తున్నాయి. ఆగస్ట్ 2021లో తాలిబాన్ అధికారం చేపట్టినప్పటి నుండి, ఇస్లామిక్ రాజ్యానికి సంబంధించిన సాయుధ గ్రూపులు జరిపిన ఇటువంటి పేలుళ్లలో వందలాది మంది సామాన్య ప్రజలు మరణించారు.
Read Also: Mother Kills Daughters: మాజీ భర్తపై పగతో.. ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన మహిళకు శిక్ష
తాలిబాన్ ప్రభుత్వ అణచివేత పాలనతో పునరావృతమయ్యే దాడులు ఆఫ్ఘనిస్తాన్‌లోని సామాన్య ప్రజల కష్టాలను పెంచుతున్నాయి. తాలిబాన్ పాలన ముఖ్యంగా విద్య, ఉద్యోగాల నుంచి నిషేధించబడిన మహిళలను అణచివేతకు గురిచేస్తోంది.