NTV Telugu Site icon

Fire accident: బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి

Bhiar Fire Accident

Bhiar Fire Accident

బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం అందుతోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పలువురిని రక్షించారు.

ఇది కూడా చదవండి: Malla Reddy: తన స్టైలే వేరంటూ.. మెట్రో రైల్లో ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే..

బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొత్తం మంటలు మరియు పొగతో చుట్టుముట్టింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

ఇది కూడా చదవండి: Bigg Boss Keerthi : మనాలిలో చిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ..

అగ్నిమాపక శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్ కూడా ఘటనా స్థలంలో ఉన్నారు. మంటలు దాదాపు అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. హోటల్‌లోని గదుల్లో ఎవరైనా చిక్కుకుపోయారా అని సోదాలు చేస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 25 మందిని రక్షించినట్లు ఆయన తెలిపారు. 11 గంటల ప్రాంతంలో పాల్ హోటల్‌లో అగ్నిప్రమాదం గురించి సమాచారం వచ్చిందని. అగ్నిమాపక సిబ్బంది ఎంతో ధైర్యంతో మంటలను అదుపు చేశారని తెలిపారు. ఈదురు గాలులతో మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.