Site icon NTV Telugu

Suicide Blast: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురికి గాయాలు

Suicide Blast

Suicide Blast

Suicide Blast in Pakistan: రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌లో భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మంగళవారం పారామిలటరీ ఫోర్స్ వాహనం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు గాయపడ్డారని తెలిసింది. పెషావర్‌లోని హయతాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా పేర్కొంటూ ఓ సీనియర్ పోలీస్ అధికారి మీడియాతో అన్నారు.

Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పురుషుల నగ్న నిరసన.. ఎందుకంటే?

ఈ ఆత్మాహుతి దాడిలో గాయాలపాలైన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాక్ష్యాలను సేకరించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పేలుడు జరిగిన ప్రదేశంలో మోహరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు పేలుడుకు బాధ్యత వహించేందుకు ఏ గ్రూపు ముందుకు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version