NTV Telugu Site icon

Himachal Pradesh: విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు పోలీసులు సహా 7 మంది మృతి

Landslide

Landslide

Himachal Pradesh: శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. 11 మందితో కూడిన వాహనం బైరాగఢ్ నుంచి తిస్సాకు వెళ్తుండగా.. చంబా జిల్లాలోని చురా ప్రాంతంలోని తర్వాయి వంతెన సమీపంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఒక పెద్ద బండరాయి వాహనం పై పడిందని, దాని కారణంగా అది వాహనం నదిలోకి పడిపోయిందని పోలీసులు వెల్లడించారు.

Also Read: Medicine: మందులు కావాలి బాబోయ్ అంటున్న పాకిస్తాన్.. పెద్ద మనసు చేసుకున్న భారత్

బాధితుల్లో చంబా బోర్డర్‌లో నియమించబడిన 2వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు పోలీసులు ఉన్నారు. వీరిని రాకేష్ గోరా, ప్రవీణ్ టోండన్, కమల్‌జీత్, సచిన్, అభిషేక్, లక్షయ్ కుమార్‌లుగా గుర్తించగా, ఏడవ బాధితుడు చంద్రు రామ్ స్థానికంగా నివాసముంటున్నాడని వారు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఒక పౌరుడితో పాటు ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని హిమాచల్‌ ప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, గాయపడిన వ్యక్తులకు ఉత్తమ చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Also Read: Men Thrash Father: పిల్లాడు ఏడుస్తున్నా కనికరించ లేదు.. కర్రలతో దారుణంగా కొట్టారు

ఇదిలావుండగా, చురాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్ మాట్లాడుతూ.. ప్రయాణం సురక్షితంగా లేనందున తాము చాలా కష్టపడి ఈ రహదారిని మూసివేసామని, అయితే ఈ ప్రాంతంలో పునరావృతమయ్యే కొండచరియల గురించి సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ రహదారిని తెరిచిందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా హన్స్‌రాజ్.. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు. పీడబ్ల్యూడీ అధికారి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న పీడబ్ల్యూడీ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి ఆగస్టు 10 వరకు, వర్షాలకు సంబంధించిన సంఘటనలు, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 234 కి చేరుకుంది. ఇందులో 83 కొండచరియలు విరిగిపడటంతో 39 మంది మరణించారు. 97 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆగస్టు 12 మరియు 13 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఆగస్టు 17 వరకు రాష్ట్రంలో జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, బురదజల్లులు, నదులు, కాలువలలో నీటి ప్రవాహం పెరుగుతుందని హెచ్చరించింది.