ఓటు హక్కును ఓటర్లకు తెలియజేసే ప్రయత్నంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నేను తప్పకుండా ఓటు వేస్తాను’ అనే థీమ్‌తో 5కే రన్ నిర్వహించారు. పాత కలెక్టరేట్ నుంచి 5కే రన్‌ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్ లో వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల సభ్యులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
TSRTC : ఉప్పల్‌లో SRH-MI మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోని వారు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు వీలుగా తమ వివరాలను తెలియజేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి భయం, ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని ప్రజలను కోరారు. 5కె రన్‌లో అదనపు కమిషనర్ శంకర్, ఎస్వీఈఈపీ నోడల్ అధికారి సురేష్ కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ముత్తెన్న, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, మున్సిపల్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. సొంతనియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్ర