CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. సొంతనియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో జనంలోకి సీఎం జగన్ వెళ్తున్నారు. ఇడుపులపాయ వద్ద ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఆయన యాత్ర తన సొంత నియోజకవర్గమైన పులివెందులను దాటి కమలాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. బస్సు యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా జననీరాజనం లభిస్తోంది. హారతులు ఇస్తూ మహిళలు స్వాగతం పలుకుతున్నారు. బస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో పాటు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, కడప జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాసేపట్లో ప్రొద్దుటూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
Read Also: CM Jagan Election Compaign: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
Also Read
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు కడప జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సీఎం చేరుకుంటారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు.
- Tags
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?