NTV Telugu Site icon

Gallbladder Stones: వామ్మో.. పిత్తాశయంలో 570 రాళ్లు.. చివరకు..

Gallbladder Stones

Gallbladder Stones

ఓ మహిళ తాజాగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను క్షుణంగా పరీక్షించిన తదుపరి గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేసి సదరు మహిళ కడుపులోని 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన సంబంధించి ఏపీ లోని అమలాపురంలో ఏఎస్ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. మే 18న ఆపరేషన్ జరగగా.. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు వివరించారు. ఇక జరిగిన ఆపరేషన్ వివరాలను ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు మీడియాకు తెలిపారు.

Bank Holidays : జూన్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి చెందిన జాలెం నరసవేణి అనే మహిళా గత కొంతకాలంగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా భోజనం చేశాక ఈ నొప్పి ఎక్కువ అవుతుండడంతో భరించలేక వైద్యులను ఆశ్రయించింది. ముందుగా దేవగుప్తం ఆసుపత్రిలో వైద్యుల వద్ద చూపించుకోగా.. అక్కడి వైద్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ నరసవేణిని పరీక్షించిన ఏఎస్ఏ వైద్య బృందం.. స్కానింగ్ లో ఆమె గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అరెస్ట్..

దాంతో వెంటనే ఆపరేషన్ చేసి వాటిని తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న డాక్టర్ నర్రా శ్రీనివాసులు, డాక్టర్ అంజలి నేతృత్వంలో అరుదైన ఆపరేషన్ చేసి నరసవేణి గాల్ బ్లాడర్ లోని నుంచి 570 రాళ్లను తొలిగించారు. సాధారణంగా 10 – 20 రాళ్లు కనిపిస్తాయని, కాకపోతే ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే మొదటి సారని డాక్టర్ తెలిపారు. ఇకపోతే సరైన సమయానికి ఆ మహిళను ఆసుపత్రిలో జాయిన్ వల్ల ఆపరేషన్ చేయడంతో ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు వైద్యులు.