Site icon NTV Telugu

China: 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రేస్.. ఎలా బయటపడిందంటే..?

China

China

64 ఏళ్ల వ్యక్తికి ఎప్పుడూ కడుపులో నొప్పి కలిగింది. అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడికి షాక్ అయ్యాడు. నిజానికి, ఆ వ్యక్తి కడుపులో ఒక టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. అతను 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా దాన్ని మింగేశాడు. 52 ఏళ్లుగా కడుపులోనే ఉంచుకున్నాడట. చైనాకు చెందిన ఈ వృద్ధుడి కడుపులో 52 సంవత్సరాలుగా టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. పరీక్షల అనంతరం.. అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ వ్యక్తి లోపల నుండి 17 సెం.మీ పొడవున్న బ్రష్‌ను తొలగించడానికి వైద్యులు 80 నిమిషాలు పట్టింది. బ్రష్ లోపల కుళ్ళిపోయి ఉంటుందని ఆ వ్యక్తి అనుకున్నాడు.

READ MORE: YS Jagan: రేపు వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం.. దానిపై నిర్ణయం తీసుకుంటారా?

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లోని ఓ నివేదిక ప్రకారం.. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన యాంగ్ అనే వ్యక్తి 12 సంవత్సరాల వయసులో టూత్ బ్రష్ మింగాడు. తల్లిదండ్రులకు చెబితే ఏం అంటారో అని భయపడ్డాడు. టూత్ బ్రష్ దానంతట అదే కరిగిపోతుందని భావించాడు యాంగ్. 64 ఏళ్ల వరకు ఎలాంటి నొప్పి కలగ లేదు. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి చేరుకున్నాడు. జీర్ణవ్యవస్థను పరిశీలించిన వైద్యులు.. టూత్ బ్రష్ చిన్న ప్రేగులో ఇరుక్కుపోయిందని గుర్తించారు. 80 నిమిషాలు కష్టపడి ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి, 17 సెం.మీ పొడవున్న టూత్ బ్రష్‌ను తొలగించారు. సాధారణంగా బ్రేష్ అంతర్గత కణజాలాలను గుచ్చుతుందని అని జౌ అనే వైద్యుడు చెప్పాడు. ఇది పేగులకు చిల్లులు పడటానికి కారణమవుతుందని, ప్రాణాంతకంగా మారుతుందరన్నారు. కానీ.. యంగ్ కడుపులోని పేగు వంపులో ఇరుక్కుపోయి దశాబ్దాలుగా కదలకపోవడం యాంగ్ అదృష్టమన్నారు.

READ MORE: Iran-Israel War : ట్రంప్ వార్నింగ్.. దాడులు ఆపేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటన..

Exit mobile version