Site icon NTV Telugu

CP Chauhan: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయి స్వాధీనం

Cp Chouhan

Cp Chouhan

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఫెడ్లర్లను అరెస్టు చేశారు. ఒడిస్సా నుండి హర్యానాకు గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. గంజాయి రవాణాకు ట్రాన్స్‌పోర్ట్ ఆటలో సీక్రెట్ పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఒడిస్సా నుండి హైదరాబాద్ మీదుగా హర్యానాకు తీసుకెళ్తున్న ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి వద్ద వాహనం తనిఖీల్లో కోటి ఇరువై ఎనిమిది లక్షల విలువైన 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Bandi Sanjay: కేసీఆర్ గాయపడటం బాధాకరం.. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా

ఈ అంశంపై రాచకొండ సీపీ చౌహాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కొత్త తరహాలో రవాణా చేస్తున్నారని.. మొదటిసారిగా ఒడిస్సా నుండి హర్యానాకు గంజాయిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారని.. సరఫరాదారుడు ఒడిస్సాకు సంబంధించిన వ్యక్తి కాగా, రిసీవర్ హర్యానాకు చెందిన వాడిగా గుర్తించారు. కోటి ఇరవై లక్షల రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా.. జమ్మూకాశ్మీర్ కు చెందిన మనోహర్, హర్యానాకు చెందిన ప్రవీణ్ లను అరెస్టు చేశామన్నారు. రిసీవర్ ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం తెలిసే‌ అవకాశం ఉందని సీపీ చెప్పారు. దారిదోపిడి, చైన్ స్నాచింగ్, చోరీలను, ఇతర నేరాలను అరికట్టడంలో రాచకొండ పోలీసులు ముందంజలో ఉంటారని చౌహాన్ పేర్కొన్నారు.

Read Also: Andhrapradesh: వైసీపీ ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

Exit mobile version