Investments in Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడుల జోరు మళ్లీ మొదలుకానుంది. రాబోయే సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025లో రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే ఒప్పందాలు (MOU)లు కుదిరినట్లు సిఆర్డిఎ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఈ సమ్మిట్ విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరగనుంది. ఈ పెట్టుబడులు ప్రధానంగా పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతులు వంటి విభాగాల్లో రానున్నాయి. అమరావతిని సుస్థిర నగర అభివృద్ధి కేంద్రంగా, అంతర్జాతీయ భాగస్వామ్యాల హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Bihar Elections 2025: ఏడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. షాక్ అవ్వాల్సిందే..!
ఇందులో భాగంగా పెట్టుబడిదారులకు సింగిల్ విండో క్లియరెన్స్, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు అనువైన సేవలు అందించేందుకు అమరావతి సిద్ధంగా ఉందని కమిషనర్ పేర్కొన్నారు. పరిశ్రమలతో పాటు సేవారంగాల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని.. కృష్ణా నది తీర ప్రాంతంలో ప్రీమియం హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులు, వెల్‌నెస్ రిసార్ట్‌లు వంటి ప్రతిపాదనలు ఇప్పటికే అందినట్లు సమాచారం. అమరావతిని కేంద్రంగా చేసుకుని హెల్త్‌కేర్ రంగంలోనూ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. కొత్త వైద్య విద్యాసంస్థలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, హెల్త్ టెక్ పార్కులు వంటి ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Google Maps AQI: గూగుల్ మ్యాప్స్‌లో ఎయిర్ క్వాలిటీని ఈజీగా చెక్ చేయొచ్చు.. ఎలా అంటే?
