Site icon NTV Telugu

Rice size: సంగారెడ్డి జిల్లాలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

Raeu

Raeu

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 1.05 కోట్ల రూపాయల విలువచేసే 500 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోటి విలువ చేసే మూడు లారీలు, నాలుగు డీసీఎంలను టాస్క్ ఫోర్స్ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు నిజాంబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి పరారీ కాగా.. మరో నిర్వాహకుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. రైతులు దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను తీసుకుని బయట విక్రయించుకుంటున్నట్లు నిందితులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Madya Pradesh: దారుణం.. తల్లిని కోడళ్లు కొట్టి చంపుతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు..

సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మీడియాకు వివరాలు వివరించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 60 శాతం బియ్యం ప్రజల దగ్గర ఉన్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇవే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ బాగోతం బట్టబయలైందన్నారు. పాశమైలారం పారిశ్రామిక వాడలో ఓ ప్లాంట్ అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా రైస్ మిల్ ఏర్పాటు చేసి రీసైక్లింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని వెల్లడించారు. గోనె సంచులపై పౌరసరఫరాల శాఖకు సంబంధించిన దొంగ ముద్రలు వేసి, దొంగ బిల్లులు సృష్టించి అదిలాబాద్ రాంపూర్ వినాయక ట్రేడర్స్ పేరు మీద ఎఫ్‌సీఐ గిడ్డంగికి ఇతర జిల్లాలకు పంపిణీ చేసినట్లు గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Thummala Nageswara Rao: రైతుభరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం..

Exit mobile version