Madya Pradesh: దారుణం.. తల్లిని కోడళ్లు కొట్టి చంపుతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కొట్టి చంపుతుంటే కొడుకు చూస్తూ నిలబడిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కోడళ్లు అత్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో జరిగింది బాధితురాలిని మున్నీ దేవీ(55)గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన మున్నీదేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఈ కేసులో మున్నీదేవీ పెద్ద కోడలు సావిత్ర, చిన్న కోడలు చందా, పెద్ద కుమారుడు ధర్మేంద్రతో పాటు చిన్న కోడలు తండ్రి, ఇద్దరు సోదరులపై కేసు నమోదైంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మార్చి 7న జిల్లాలోని అంత్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రిపుర గ్రామంలో మున్నీదేవీ అనే వృద్ధురాలని కొట్టి చంపిన వీడియో వైరల్ కావడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కోడళ్లు ఇద్దరు కర్రలు, రాళ్లతో మున్నీదేవిపై దాడి చేశారు. అక్కడే ఉన్న కొడుకు ఈ దాడిని అడ్డుకోకపోగా, దాడిని సమర్థించడం వీడియో కనిపించింది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
Read Also: Salman Khan Firing: సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో కీలక ఆధారాలు లభ్యం!
ప్రాథమిక విచారణ ప్రకారం.. రెండేళ్ల క్రితం పెద్ద కోడలు సావిత్రి, అత్త మున్నీదేవీపై దాడి చేయడంతో ఆమె తలకు ఆరు కుట్లు పడ్డాయి. ఈ ఘటన తర్వాత అత్తా -కోడలు వేరుగా ఉంటున్నారు. అయితే చిన్న కుమారుడు రవికి దాతియా నివాసి చందా కుమారితో వివాహం జరిగింది. పెద్ద కోడలు, చిన్న కోడలు మధ్య పరిచయం బలపడటం మున్నీదేవికి నచ్చలేదు. దీంతో చందాకుమారిని వేధించడం ప్రారంభిచినట్లు తెలుస్తోంది. ఈ విషయమై చందా తన తండ్రి అమర్ సింగ్, సోదరులు అజయ్, విజయ్ సమక్షంలో పంచాయతీ పెట్టింది. అయితే, చర్చల్ని సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో అత్త మున్నీదేవీపై పెద్ద కోడలు సావిత్రి దాడి ప్రారంభించింది. తర్వాత చిన్న కోడలు కూడా దాడిలో పాలు పంచుకుంది. కొడుకు ఉన్న కూడా దాడిని ఆపకుండా, తన భార్యను సపోర్టు చేశాడు. మున్నీదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో గ్వాలియన్ లోని జయరోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణిచించింది.
తాజావార్తలు
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!