ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్‌లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా సంస్థ ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఇప్పటికే వారికి ఆహ్వానం అందింది. ఈ మహిళా సర్పంచ్‌లందరూ ‘ప్రధానమంత్రి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ అవార్డు’ జాబితాలో ఎంపిక చేయబడ్డారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపిక చేయబడిన ఈ సర్పంచ్‌లు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అసాధారణమైన పనితీరు కనబరిచారని ఓ అధికారి తెలిపారు.
READ MORE: Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..
ఈ విషయం గురించి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ,..”150 మంది మహిళా సర్పంచ్‌లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పంచాయతీ స్థాయిలో రాజకీయ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి, గుర్తించడానికి ప్రభుత్వ నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు, పరిపాలనలో మహిళలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. మహిళా శక్తిని ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రచారానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE:Stock market: హిండెన్‌బర్గ్ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
నారీ శక్తి అభియాన్ మరింత బలపడుతుంది
ఇటీవలి 50కి పైగా గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికల ఓటమి నేపథ్యంలో.. మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మహిళలను ఆహ్వానించడం ద్వారా, పరిపాలన అట్టడుగు నాయకత్వానికి, నారీ శక్తి అభియాన్ పట్ల బీజేపీ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. ఈ ప్రయత్నం నారీమణులను గుర్తించడమే కాకుండా.. మహిళలకు సాధికారత కల్పించడం, గ్రామీణ పాలనను పెంపొందించడాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం యత్నిస్తోంది.