Toilet Collapse: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్డి కూలిపోయిన శిథిలాల కింద 5 ఏళ్ల బాలుడు సజీవ సమాధి అయ్యాడు. ఈ ఘటన శనివారం మగల్‌గంజ్‌లోని చపర్తల గ్రామంలో చోటుచేసుకుంది. 5 ఏళ్ల పంకజ్ ప్రభుత్వ టాయిలెట్ దగ్గర ఆడుకుంటుండగా.. నాసిరకం వస్తువులతో నిర్మించిన అది ఒక్కసారిగా అతనిపై కుప్పకూలింది.
Read Also: IndiGo Flight: పాకిస్థాన్‌లో అత్యవసరంగా ఇండిగో విమానం ల్యాండింగ్.. కారణమేంటంటే?
మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమ 5 ఏళ్ల కుమారుడు పంకజ్ ఇంటి బయట నిర్మించిన మరుగుదొడ్డి దగ్గర ఆడుకుంటుండగా, అది ఒక్కసారిగా అతనిపై కుప్పకూలిందని మృతుడి కుటుంబీకులు తెలిపారు. పంకజ్ శిథిలాల కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 2016లో గ్రామపెద్ద, గ్రామ కార్యదర్శి నాసిరకం వస్తువులతో మరుగుదొడ్డి నిర్మించారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మరణానికి కారణమైన మరుగుదొడ్డి నాసిరకం అని ఆరోపిస్తూ గ్రామ పెద్ద, గ్రామ కార్యదర్శిని కుటుంబ సభ్యులు నిందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, నిందితులపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు.