NTV Telugu Site icon

T20 India win celebrates: బాణసంచా పేలి ఐదేళ్ల బాలుడు మృతి

Mp

Mp

ఇండియా టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా గెలుపు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని.. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం సంబరాలు ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP-TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కొంత మంది పిల్లలు రోడ్డుపై స్టీల్ గ్లాస్‌లో బాంబును అమర్చి పేల్చారు. అది కాస్త ముక్కలై.. గ్లాస్ ముక్క వచ్చి.. దగ్గర నుంచి చూస్తు్న్న ఐదేళ్ల బాలుడి కడుపులో గుచ్చుకుంది. దీంతో సమీపంలో ఉన్న వారు స్పందించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు బాదయ్య మొహల్లా నివాసి అయిన దీపక్ ఠాకూర్‌(5)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరీ ఈ కేసును ఏ విధంగా ధర్యాప్తు చేస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న న‌భా న‌టేష్‌..

Show comments