NTV Telugu Site icon

Telangana: గల్ఫ్ వర్కర్స్‌కు 5 లక్షల పరిహారం.. గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

Telangana Government

Telangana Government

Telangana: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. గల్ఫ్ వర్కర్స్‌కు ఐదులక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. గల్ఫ్‌కి వెళ్లి చనిపోయిన కార్మికుడికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల ఎంపిక కోసం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. గల్ఫ్ బాధిత కుటుంబాలు కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గైడ్‌లైన్స్‌లో ప్రకటించింది. కార్మికుడు చనిపోయిన ఆరు నెలలలోపు దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించింది. బహ్రెయిన్‌, కువైట్‌, ఇరాక్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులకు ఇది వర్తించనుంది.

Read Also: AV Ranganath : హైడ్రా కీలక నిర్ణయం.. యాప్‌ను తీసుకువ‌స్తున్న హైడ్రా