రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఎన్‌హెచ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో వేగంగా వస్తున్న బస్సు-ట్రక్కును ఢీకొట్టింది.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్!
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని హల్దీనా గ్రామ సమీపంలో ఆగ్రా-జైపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో 5 మంది మరణించారని.. 12 మంది గాయపడినట్లు అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భరత్‌పూర్‌లోని ఆర్‌బీఎం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Pinnelli Ramakrishna Reddy: హైదరాబాద్‌లో ఉన్నా.. అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై స్పందించిన పిన్నెల్లి..
