NTV Telugu Site icon

Tirupati: రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసన

Tirupati

Tirupati

Tirupati: తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైట్‌ వచ్చింది. తిరిగి ఉదయం 8.15 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ రద్దు చేయడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వేచి ఉండడంతో అసహనంతో ప్రయాణికులు బైఠాయించారు. ఎయిర్‌లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

 

Read Also: Koti Deepotsavam 2024 Day 4: నాలుగో రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..

 

Show comments