NTV Telugu Site icon

Ranji Trophy 2024: 42వ సారి టైటిల్ కైవసం చేసుకున్న ‘ముంబయి’..!

Ranji

Ranji

తాజాగా జరుగుతున్న 2024 రంజీ ట్రోఫీ ఫైనల్​ లో విదర్భ పై ముంబయి ఘన విజయం సాధించింది. మొదట్లో వన్ సైడ్ గా జరిగిన మ్యాచ్ చివరికి హోరాహోరీగా సాగింది. కాకపోతే చివరకి 169 పరుగుల తేడాతో విదర్భ పై నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్​ గా అవతరించింది. చివరిసారిగా ముంబయి జట్టు 2015 – 16లో టైటిల్ గెలిచింది. 538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్ ​లో కాస్త గట్టిగానే పోటీ ఇచ్చి 368 పరుగులకే కుప్పకూలింది.

Also read: Viral Video: ఏంది భయ్యా ఇది.. సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో ఇంత సీక్రెట్ దాగుందా..?!

గడిచిన ఎనిమిదేళ్లలో ముంబయి రంజీ ట్రోఫీ ఛాంపియన్ ​గా నిలివడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్క లో రుణ్ నాయర్ 74, అక్షయ్ వాడ్కర్ 102, హర్ష్ దూబే 65 పరుగులతో రాణించారు. ఇక ముంబయి బౌలర్ల విషయానికి వస్తే తనుశ్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్ దేశ్​పాండే 2 షమ్స్ ములాని 1 వికెట్లను నేలకూల్చారు. భారీ లక్ష్య ఛేదనలో భాగంగా విదర్భ ఒకానొక దశలో 352-5 తో గెలుపు గెలుపు వైపు ప్రయాణించింది. ఆ సమయానికి అక్షయ్ వార్కర్ (102), వార్ష్ దూబే (65) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్​కు 130 పరుగుల భాగస్వామ్యం చేయడంతో ముంబయిని కాస్త ఆందోళనలో పడేసారు.

Also read: Viral Video : అనారోగ్యానికి గురైన కేర్ టేకర్ ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన ఏనుగు

ఈ సమయంలో తనష్ కొటియన్ 353 పరుగుల వద్ద సెంచరీ హీరో అక్షయ్​ ను పెవిలియన్ కి పంపడంతో ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా కేవలం 15 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. దింతో కప్ ముంబై వశమైంది.