NTV Telugu Site icon

Gold Seized: ఎయిర్‌పోర్టులో 41 కిలోల బంగారం పట్టివేత.. 100 కేజీల వెండి స్వాధీనం

Gold Seized

Gold Seized

Gold Seized: విదేశాల నుంచి స్మగ్లర్లు బంగారాన్ని భారీ ఎత్తున భారత్‌కు తరలిస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 25 కిలోల బంగారంను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఆ మహిళలు ఇద్దరూ వివిధ మార్గాల్లో బంగారాన్ని ముంబై తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

ముంబయి ఎయిర్‌పోర్టులోనే ఓ ప్రయాణికుడి నుంచి రూ.8.40 కోట్ల విలువైన 16 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడిస్‌ అబాబా నుంచి వచ్చిన అతడి నడుము బెల్ట్‌లో పెట్టుకున్న బంగారాన్ని అధికారులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్ విమానం వచ్చిన అతడిని సోదాల అనంతరం ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆ వ్యక్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Uber driver: బిడ్డ చదువు కోసం తండ్రి చదువుతున్నాడు.. ఉబెర్‌ ఆటోడ్రైవర్ స్టోరీ

100 కిలోల వెండి పట్టివేత: ఓ ప్రైవేట్‌ బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సమారు రూ.86లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ వెండిని అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments