శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు మాత్రం పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలను పోషించే శక్తిలేక బాల్యంలోనే పెళ్లిళ్లు చేయడానికి సిద్ధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆస్తులను ఆశగా చూపి తమ కంటే 20 ఏళ్లు తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు కొందరు వ్యక్తులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ నందిగామలో బాల్య వివాహం చేసుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:Supreme Court: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేసిన తల్లితో సహా మరో ముగ్గురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఎనిమిదవ తరగతి చదువుతోంది. పేద కుటుంబం కావడంతో కూతురు పెళ్లి చేసేందుకు రెడీ అయ్యింది ఆ బాలిక తల్లి. ఈ క్రమంలో చేవెళ్ల మండలం, కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్(40) తో మే 28న బాల్య వివాహం స్థానిక ఆలయంలో చేశారు. అప్పటినుంచి చిన్నారి తల్లి వద్దనే ఉంటుంది.
Also Read:Himanshi Narwal: ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి
ఇటీవల పాఠశాలకు వెళ్లిన బాలిక ఆషాడం ముగియడం తో అత్తగారి ఇంటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో విషయం స్కూల్ లో టీచర్ కి చెప్పింది. దీంతో ఉపాధ్యాయులు తహసిల్దార్ రాజేశ్వర్, ఇన్స్పెక్టర్ ప్రసాద్ లకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు అధికారులు.. బాలికకు వివాహం చేసిన తల్లి స్రవంతితో సహా పెండ్లి కొడుకు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, సంబంధం చూసిన వ్యక్తి పెంటయ్యపై కేసు నమోదు చేసి బాలికను ఐసీ డీఎస్ అధికారుల సహకారంతో సఖి సెంటర్ కు తరలించారు.
