Site icon NTV Telugu

Drones: పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం..మూడింటిని కూల్చేసిన జవాన్లు

Fazikla,

Fazikla,

Drones: ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలొస్తున్నాయ్. కారణం నిత్యం దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా పాక్ డ్రోన్లు దేశంలోకి ప్రవేశిస్తుండడం కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల కలకలం రేగింది. సరిహద్దు వెంబడి 4పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డగించి.. వాటిలో మూడింటిని దేశ భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్‌సర్‌ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన మూడు డ్రోన్లు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. అయితే గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వెంటనే అప్రమత్తమై.. వాటిపై కాల్పులు జరిపి నేలకూల్చారు. మరో డ్రోన్ ను శనివారం రాత్రి కూల్చివేశారు. వాటిలో ఒకదాంట్లో అనుమానాస్పద మత్తు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు.

Read Also:Mallikarjun Kharge : ప్రధాని జపాన్ పోయినప్పుడల్లా నోట్ల రద్దు.. అదేందో మరి

మరో డ్రోన్ డీజేఐ మ్యాట్రిస్ 300 ఆర్టీకే పేరుతో ఉన్న బ్లాక్ క్వాడ్‌కాప్టర్ ఉంది. దీనిని అమృత్‌సర్ జిల్లాలోని ఉదర్ ధరివాల్ గ్రామంలో భద్రతా బలగాలు కూల్చివేశాయి. డ్రోన్ ను కూల్చివేసి, స్వాధీనం చేసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ సిబ్బంది మానవరహిత వైమానిక వాహనాన్ని కాల్పులు జరిపి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. మరో డ్రోన్‌కు రతన్‌ ఖుర్ద్‌ గ్రామంలో స్వాధీనం చేసుకున్నామని, దానికి 2.6 కిలోల రెండు హెరాయిన్‌ ప్యాకెట్లను గుర్తించామని తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ ఫ్రంట్‌లో మూడో డ్రోన్‌ని అడ్డుకున్నారు. అయితే అది పాక్‌వైపు తిరిగి వెళ్లిపోయింది. పాకిస్తాన్ వైపు నుండి కొంతమంది మూడవ డ్రోన్‌ను ఎత్తినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని ప్రతినిధి చెప్పారు.

Read Also:Tollywood Anchors: మాల్దీవుల్లో వెకేషన్స్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పాపలు

Exit mobile version