Site icon NTV Telugu

Gold Seized: సంగారెడ్డి జిల్లాలో 4.8 కిలోల బంగారం పట్టివేత

Gold

Gold

Gold Seized: సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 4.8 కిలోల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బంగారు నగలకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా బ్యాగులో బంగారం బయటపడింది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో బంగారం బ్యాగుతో ఉన్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పట్టుబడ్డ బంగారం విలువ 5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

Read Also: TG Governor: జయశంకర్‌కు నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Exit mobile version