Srisailam: శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. సాగర్ గేట్లు తెరిచే అవకాశం
- నిండుకుండలా మారిన శ్రీశైలం
- 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరిచి నీటి విడుదల
- నాగార్జున సాగర్‌కు భారీగా వస్తున్న వరద
- రేపు సాగర్ గేట్లు తెరిచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.20 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 200.1971 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి 2,98,573 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా డ్యాం గేట్లు తెరవడంతోపాటు వారాంతపు సెలవులు రావడంతో హైదరాబాద్ ఘాట్ రోడ్డు మొత్తం 4 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. కృష్ణమ్మ పరవళ్ల అందాలను చూస్తూ యాత్రికులు సెల్ఫీలు తీసుకుంటూ మైమరిచిపోతున్నారు.
Read Also: Tirumala: అక్టోబర్ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Also Read
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
ఇదిలా ఉండగా.. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ డ్యామ్ వేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ఉదయం 7గంటల కల్లా 260.0858 టీఎంసీల నీరు ఉంది. మరో 52 టీఎంసీలు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. సోమవారం సాయంత్రం కల్లా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తూ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు 4,58,393 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 40,560 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలకు వరద నిలకడగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?