Site icon NTV Telugu

Akola Unique Couple: 4.2 అడుగుల వరుడు, 3.8 అడుగుల వధువు.. పెళ్లిపీటలెక్కిన ఆన్ లైన్ ప్రేమ

Akola

Akola

షార్ట్ హైట్ ఉన్న వధువు, వరుడు వారి పెళ్లి వేడుకతో నెట్టింటా వైరల్ గా మారారు. సోషల్ మీడియాలో మొదలైన ప్రేమాయణం పెళ్లి పీటలెక్కింది. అకోలా నివాసి ప్రతీక్ ధనుక, మధ్యప్రదేశ్‌లోని సిరోజ్ నివాసి రేణుక నామ్‌దేవ్ అనే జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 4.2 అడుగుల పొడవున్న వరుడు, 3.8 అడుగుల పొడవున్న వధువు నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. ప్రతీక్, రేణుక సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. ఇరు కుటుంబాల్లో పెద్దలను ఒప్పించారు. వారి కుటుంబాలు అంగీకరించిన తర్వాత సిరోంజ్‌లో వివాహం చేసుకున్నారు.

Also Read:Story Board: హై ప్రొఫైల్ కేసులోనూ ఇంత అసాధారణ జాప్యమా..? సినీ నటి ప్రత్యూష కేసు ఎందుకు ఆలస్యం..?

అకోలా నగరంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. నూతన వధూవరులకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివాహం, రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, ఈ జంట వైరల్ అయ్యారు. వేలాది మంది వారి సింప్లిసిటీ, ధైర్యాన్ని ప్రశంసించారు. వరుడు ప్రతీక్ ధనుక పూణేలోని ఐసిఐసిఐ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. వధువు రేణుక నామ్‌దేవ్ సిరోంజ్‌లోని ఒక పాఠశాలలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

Exit mobile version