China : కరోనాతో చైనా అతలాకుతలం.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : ఎవరు తీసుకున్న గోతిలో వారేపడతారన్న సామెత చైనాకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచాన్నే గడగడలాడించిన మహమ్మారిని తయారు చేసిన పాపం ఊరికే పోతుందా.. అందుకే చేసిన తప్పుకు తగిన మూల్యం చెల్లించుకుంటూ వస్తోంది చైనా. అన్ని దేశాలు కరోనా నుంచి బయటపడుతున్నా అక్కడ మాత్రం వైరస్ ఉనికి తగ్గడం లేదు. రోజు రోజుకు ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో వైరస్ వారిని వెంటాడుతూనే ఉంది. నిత్యం వేలాది కేసులు వస్తూ అక్కడ జనాలతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. తాజాగా చైనా దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది.
Read Also: Big Breaking : కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులో ఇంత మంది మహమ్మారి భారిన పడడం ఇదే మొదటిసారని పేర్కొంది. బుధవారం 29,390 కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు అమలు చేస్తుండగా, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. చైనాలో కొన్నిరోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ‘జీరో కరోనా’ విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. సుమారు ఆరు నెలల తర్వాత ఈ నెల 20న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది. రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 87 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించాడు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!