NTV Telugu Site icon

Bharat Jodo Yatra: 3వేల కిలోమీటర్లు పూర్తి.. నేడు యూపీలో పునఃప్రారంభం

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తొమ్మిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నేడు పునఃప్రారంభం కానుంది. 110 రోజులకు పైగా సాగిన యాత్రలో ఇప్పటివరకు 3వేల కిలోమీటర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది.

భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు చేయని.. కాలినడకన సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇదేనని కాంగ్రెస్ పేర్కొంది. జనవరి 26న శ్రీనగర్‌లో ముగిసే యాత్ర తర్వాత, యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారాన్ని ప్రారంభించనుంది.కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను సోదరి, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించారు.

Siddeshwar Swami: జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి కన్నుమూత.. ప్రధాని సంతాపం

భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ రెండు నెలల పాటు ‘హత్ సే హాత్ జోడో ప్రచారాన్ని’ ప్రారంభిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా ప్రతిచోటా మహిళా సభ్యులతో పాదయాత్రలు, ర్యాలీలకు నాయకత్వం వహిస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ‘భారత్ జోడో యాత్ర’ సందేశాన్ని వ్యాప్తి చేస్తారన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రజలపై, ముఖ్యంగా మధ్యతరగతిపై దాని ప్రభావంపై దృష్టి సారించి, మార్చిలో ప్రియాంక గాంధీ వాద్రా మహిళా కార్యకర్తలతో కవాతులకు నాయకత్వం వహిస్తారని సమాచారం. మహిళలకు సంబంధించిన ఇతర అంశాలు కూడా ప్రధాన ర్యాలీ పాయింట్‌గా ఉంటాయి.

Show comments