Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 300 Stones In Kidney Doctors Remove 300 Kidney Stones From Taiwanese Woman After Takes Bubble Tea

300 Stones In Kidney: నీటికి బదులు బబుల్ టీ.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు!

Published Date :December 19, 2023 , 10:34 am
By Sampath Kumar
300 Stones In Kidney: నీటికి బదులు బబుల్ టీ.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

300 Stones in Taiwanese woman Kidney after Takes Bubble Tea: మంచి నీరు తాగడం మానేయడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటికి బదులు టీ, జ్యూసెస్ తాగితే చాలనుకోవడం కూడా చాలా ప్రమాదం. నీటికి బదులుగా డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. తైవాన్‌లో 20 ఏళ్ల మహిళ కిడ్నీలో 300 రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 300 కిడ్నీ రాళ్లను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.

జియావో యు అనే మహిళకు మంచి నీరు తాగడమంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. దాంతో ఆమె నీటికి బదులుగా బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్ తీసుకుంది. జియావో కొన్నేళ్లుగా నీళ్లకు బదులు స్వీట్ డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. మంచి నీరు తీసుకోక పోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతుంది. తాజాగా జ్వరం మరియు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

చి మెయి హాస్పిటల్‌లోని వైద్యులు జియావోకు టెస్టులు చేసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వైద్యులు ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 5 మిమీ నుండి 2 సెంటీమీటర్ల వరకు ఉండే రాళ్లను స్కాన్‌లో గుర్తించారు. మరోవైపు రక్త పరీక్షలో జియావో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ సర్జరీ చేసి ఆమె కిడ్నీలోని రాళ్లను బయటకు తీశారు. రెండు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో వైద్యులు ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను వెలికితీశారు. శస్త్రచికిత్స తర్వాత జియావో పరిస్థితి మెరుగుపడింది. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.

Also Read: IPL Auction 2024: నేడే ఐపీఎల్‌ మినీ వేలం.. అదృష్టం పరీక్షించుకోనున్న 333 మంది ఆటగాళ్లు! జాక్‌పాట్‌ ఎవరికో

జియావోకు సర్జరీ చేసిన డాక్టర్ లిమ్ చై-యాంగ్ మాట్లాడుతూ ఈ పరిస్థితికి కారణం నీరు తాగకపోవడమే అని చెప్పాడు. నీటికి బదులుగా
స్వీట్ డ్రింక్స్ తాగడం ఆమె మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోవడానికి దారితీసిందన్నారు. బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్‌లో చక్కెర, యాడెటివ్స్ ఉన్నాయని.. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి.. స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు అవసరమని ఆయన చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 300 Kidney Stones
  • 300 Stones In Kidney
  • Bubble Tea
  • kidney
  • kidney stones

తాజావార్తలు

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

  • Pawan Kalyan: పవన్ విడాకులపై స్టాండప్ కమెడియన్ దారుణ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్!

  • Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!

  • Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions