Site icon NTV Telugu

Kidnap Case: పాతబస్తీలో మూడు సంవత్సరాల బాలిక కిడ్నాప్?

Kidnap

Kidnap

Kidnap Case: మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్‌కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అల్ జుబేల్ కాలనీకి చెందిన సోహైల్ (25) బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన మూడు సంవత్సరాల మైనర్ బాలిక ఇంటి బయట ఒంటరిగా ఆడుకుంటుంది. దీంతో సదరు బాలికను సోహైల్ అనే యువకుడు చంకన ఎత్తుకొని చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని మహంకాళి ఆలయం రూట్‌లో తీసుకెళ్తుండగా అప్పటికే వెతుకుతున్న బాలిక కుటుంబ సభ్యులు పట్టుకొని బండ్లగూడ పోలీసులకు అప్పగించారు.

Read Also: Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..

బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు సోహైల్‌పై కిడ్నాప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సోహైల్ మాత్రం తాను కిడ్నాపర్‌ను కాదని, బాలిక తప్పిపోయిందని వారిని తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు సోమవారం ఉదయం సీసీ కెమెరాలను పరిశీలించనున్నారు. ఇది కిడ్నాపా? కాదా? లైంగిక దాడికోసం తీసుకెళ్తున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version