Site icon NTV Telugu

Jammu & Kashmir: కశ్మీర్ లో దారుణం.. ముగ్గురు బాలికలు సజీవదహనం..

J&m

J&m

Fire Accident: జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మారుమూల గ్రామంలో ఇవాళ తెల్లవారు జామున ఇంటికి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే, ఉఖ్రాల్ బ్లాక్‌లోని ధన్మస్తా- తజ్నిహాల్ గ్రామంలోని మూడు అంతస్తుల ఇంట్లో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఆ ఇంట్లో బిస్మా (18), సైకా (14), సానియా (11) పై అంతస్తులో నిద్రిస్తుండగా.. ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో ఆ ముగ్గురు అక్క చెల్లెల్లు బయటకు రాలేకపోవడంతో దీంతో పూర్తిగా సజీవదహనం అయ్యారు.

Read Also: Lover Kidnap: ఘట్కేసర్ లో కలకలం.. చెల్లిని ప్రేమించాడని యువకుడి కిడ్నాప్..

అయితే, ఇంట్లో మంటలు వ్యాపించాయని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హూటహూటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఆ మంటల్లో ముగ్గురు మైనర్ బాలికలు ( అక్కచెల్లెల్లు ) మరణించారు. కాగా, వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version