Pakistan: పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వేళ కాల్పులు.. ముగ్గురు మృతి
- పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వేళ కాల్పులు
- ముగ్గురు మృతి
- పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ ఈరోజు అంటే ఆగస్టు 14న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంగా కరాచీ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాక్ లో కాల్పులు కలకలం రేపాయి. వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మృతుల్లో 8 ఏళ్ల బాలిక, ఒక వృద్ధుడు ఉన్నారు. స్థానిక మీడియా ప్రకారం, అజీజాబాద్‌లో వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ బాలిక కాల్పులకు గురైంది. కోరంగిలో స్టీఫెన్ అనే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు.
Also Read:War2 Review : వార్ 2 ఓవర్సీస్ రివ్యూ..
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
స్థానిక పోలీసుల ప్రకారం, కరాచీలోని అనేక ప్రాంతాల్లో కాల్పుల సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో లియాఖతాబాద్, కోరంగి, లియారి, మహమూదాబాద్, అక్తర్ కాలనీ, కెమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. షరీఫాబాద్, నార్త్ నజీమాబాద్, సుర్జాని టౌన్, జమాన్ టౌన్, లాంధి వంటి ప్రాంతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి.
Also Read:OnePlus Nord 5 vs Vivo V60: ప్రాసెసర్, డిస్ప్లే, డిజైన్ లో ప్రీమియం ఏది? ఎందుకు?
ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆధునిక ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తమ ఆపరేషన్ కొనసాగుతోందని, కాల్పులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కాల్పుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2024లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో ఒక చిన్నారి మరణించగా, 95 మందికి పైగా గాయపడ్డారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!