అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీద నుంచి వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Haryana : రూ.200తల్లిని అడిగాడని.. అన్నను కత్తితో పొడిచిన తమ్ముడు
మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. గ్రీన్‌విల్లే కౌంటీ కరోనర్స్ ఆఫీస్ I-85లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 20 అడుగులు గాల్లోకి లేచి.. అనంతరం అదే ఎత్తులో ఉన్న చెట్లను ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని క్రాష్ డిటెక్షన్ సిస్టమ్ ఇతర కుటుంబ సభ్యులకు అలర్ట్ పంపింది. దీంతో వారు సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
ఇది కూడా చదవండి: YSRCP Election Manifesto 2024: వైసీపీ మేనిఫెస్టో విడుదల.. 9 ముఖ్యమైన హామీలు ఇవే..
