NTV Telugu Site icon

Childrens Died: యూపీలో విషాదం.. గుడిసెలో మంటలు అంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి

Fire Up

Fire Up

ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలకు నిప్పంటుకుని అందులో ఉన్న ముగ్గురు చిన్నారులు మృత్యువాత చెందారు. ఈ ఘటన జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామంలో జరిగింది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. డేరా బంజారా ప్రాంతంలోని తమ గుడిసెలో రాత్రిపూట పిల్లలు నిద్రిస్తుండగా మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు చెలరేగగా.. ముగ్గురు చిన్నారులు అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Parvathy Thiruvothu: మొన్న దూత.. నేడు కడక్ సింగ్.. అద్భుతమైన పాత్రలతో అదరగొడుతున్న బ్యూటీ

పిల్లలను రక్షించేందుకు వారి తండ్రి షకీల్‌ ప్రయత్నించాడు. కానీ ఎంతకు కాపాడేందుకు వీలుకాకపోవడంతో ఇద్దరు మంటల్లో కాలిపోగా, ఒక చిన్నారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు రక్షించబోయిన తండ్రికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నట్లు రూరల్ ఎస్పీ రణవిజయ్ సింగ్ తెలిపారు.

Read Also: South Central Railway: మిచౌంగ్ తుఫాన్‌ ఎఫెక్ట్.. 151 రైళ్లు రద్దు

మృతి చెందిన చిన్నారులు సామ్నా(7), అనీస్ (4), రేష్మ (2)గా గుర్తించారు. అనీస్, రేష్మ మంటల్లో కాలిబూడిద కాగా.. సామ్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ ఉజ్వల్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. చిన్నారుల కుటుంబానికి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందిస్తామన్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.