Indo-Pak War Time: తాజాగా పశ్చిమ త్రిపుర జిల్లాలో 1971 ఇండో-పాక్ యుద్ధ కాలానికి చెందిన మొత్తం 27 మోర్టార్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దులాల్ నామా ఇంటి వద్ద కూలీలు చెరువు తవ్వుతుండగా ఈ మందు గుండ్లు బయటపడ్డాయి. తొలుత 12 మోర్టార్ షెల్స్ లభ్యమయ్యాయని, ఆ తర్వాతి తవ్వకాల్లో మరో 15 దొరికాయని పోలీసులు తెలిపారు. సుమారు 50 సంవత్సరాల నాటివిగా అంచనా వేస్తున్న ఈ మోర్టార్ షెల్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని బముటియా ఔట్‌పోస్ట్ అధికారి ఇన్‌చార్జ్ తెలిపారు.
Bhadrachalam: భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరిన వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు..
ముక్తి బాహిని (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు) సభ్యులు గుండ్లు పూడ్చిపెట్టి ఉండవచ్చని అక్కడి గ్రామస్థులు భావిస్తున్నారు. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనంత దాస్ ఈ రికవరీని ధృవీకరించారు. ఈ విషయం పై ఆయన స్పందిస్తూ.. ” మందు గుండ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. వాటిపై లేబుల్ పోవడం కారణంగా వాటి ఖచ్చితమైన మూలాలు, తయారీ వివరాలను గుర్తించడం కష్టమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ఆయుధ నిపుణులు మాత్రమే వాటికీ సంబంధిత చరిత్రను నిశ్చయంగా గుర్తించగలరని దాస్ అన్నారు. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తిలో కీలకపాత్ర పోషించిన ముక్తి బహిని, త్రిపుర సరిహద్దును పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగించుకుంది.
Peddapalli: నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన..