Heart Attack: పోర్న్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.అడల్ట్ ఫిల్మ్‌స్టార్స్ వరసగా మరణిస్తున్నారు. గత నెల ఓ నటి ఆత్మహత్య చేసుకోగా.. ఆదివారం మరో అడల్ట్ స్టార్ 26 ఏళ్ల సోఫియా లియోన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. తాజా పోర్న్ స్టార్ ఎమిలీ విల్లిస్(26) గుండెపోటుకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఎమిలీ విల్లిస్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని వైద్య, కుటుంబ సభ్యులు అభిమానులకు సమాచారం అందించారు. ఆమెకు గుండెపోటు రావడానికి కారణం మాదక ద్రవ్యాలు అధికంగా వినియోగించడమే కారణమని వైద్యులు గుర్తించారు. ఎమిలీ విల్లీస్‌కు 20 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.
Read Also: Suriya: హీరో సూర్య లేటెస్ట్ లుక్ చూశారా.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా..
ఎమిలీ విల్లీస్ మాదక ద్రవ్యాలు ఉపయోగించడం, ఇటీవల కాలంలో ఓవర్ డోస్ కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఎమిలీని ఆస్పత్రికి తరలించాడనికి ముందు 80 శాతం మేర ఆహారం తీసుకోవడం మానేసింది. అలాంటి పరిస్థితిలో ఆమెను రిహాబిలేటషన్ సెంటర్‌కు తరలించారు. ఆ క్రమంలో చికిత్స అందిస్తున్న సమయంలో ఎమిలి గుండెపోటుకు గురైందని వైద్యులు తెలిపారు. రిహాబిలిటేషన్ సెంటర్‌లో జరిపిన పరీక్షల్లో టాక్సికాలజీ టెస్టింగ్‌లో నెగిటివ్ వచ్చింది. దాంతో ఆమెకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరమైంది. ఈ క్రమంలో మెరుగైన చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె తీవ్రమైన గుండెపోటుకు లోనైంది. ప్రస్తుతం శ్వాస ప్రక్రియ మెరుగ్గా ఉండటానికి ఆమెను వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందిస్తున్నామని వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Surya Kiran: సూర్య కిరణ్ నట ప్రస్థానం.. హీరోయిన్ తో ప్రేమ, పెళ్లి.. విడాకులు
ఎమిలీ విల్లీస్ ఆర్థిక పరిస్థితి గురించి ఆమె సోదరుడు దీనంగా అర్థిస్తున్నారు. ఆస్పత్రిలో బిల్లులు చెల్లించేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఎమిలీ వైద్యం కోసం 6 లక్షల డాలర్లు అవసరమని అర్థించారు. డబ్బు కోసం అభిమానులు, సినీ ప్రముఖులను ఆశ్రయించామని.. 50 వేల డాలర్లు సమకూరాయని తెలిపాడు. ప్రస్తుతం ఎమిలీ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఎమిలీ విల్లీస్ ఆరోగ్యం మెరుగుపడేలా అభిమానులు భగవంతుడిని వేడుకోవాలని, ఆమె కోసం ప్రార్థనలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎమిలీ విల్లీస్ రెండేళ్ల క్రితం అడల్ట్ ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.