Russia-Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులు.. 26 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: రష్యా దాడులు శుక్రవారం ఉక్రెయిన్ అంతటా నగరాలను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా 26 మంది మరణించారు. మాస్కో దళాలపై ఎదురుదాడికి కీవ్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి. ఉక్రెయిన్‌లోని చారిత్రాత్మక నగరమైన ఉమాన్లోని నివాస భవనాలపై దాడులు జరిగాయి. పలువురు ఆ భవన శిథిలాల కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఉమాన్ నగరంలోని నివాస భవనంపైకి రెండు క్షిపణులు దూసుకెళ్లిన సందర్భంగా ఐదుగురు చిన్నారులు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ భారీ పేలుడు శబ్దాల నేపథ్యంలో ఆ అపార్ట్మెంట్ పక్క భవనంలో ఉండే ఓ వృద్ధురాలికి అంతర్గతంగా రక్తస్రావమైందని అత్యవసర సేవల సిబ్బంది తెలిపారు. తాజా దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైనా క్షిపణులు దూసుకొచ్చాయి. 80,000 మంది జనాభా ఉన్న ఉమాన్ నగరంలో బహుళ అంతస్థుల హౌసింగ్ బ్లాక్ అవశేషాల మధ్య ప్రాణాలతో బయటపడిన వారి కోసం రక్షకులు క్రేన్లను ఉపయోగిస్తున్నారు.
Read Also: Mayor Vijayalaxmi: చిన్నారి కొట్టుకుపోయింది గుంతలో.. మ్యాన్ హోల్ లో కాదు
Also Read
- Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
- India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
- WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
- Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజా దాడులను ఖండించారు. దీనికి అనుభవించక తప్పదని ప్రతిజ్ఞ చేశారు. సంపూర్ణ చెడు మాత్రమే ఉక్రెయిన్‌పై అటువంటి భీభత్సాన్ని సృష్టించగలదని ఆయన తన సాయంత్రం ప్రసంగంలో చెప్పారు.మాస్కో ఉక్రేనియన్ మిలిటరీకి చెందిన రిజర్వ్ యూనిట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ అన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని మాస్కోలో ఏర్పాటు చేసిన అధికారులు ఉక్రెయిన్ షెల్లింగ్‌లో డోనెట్స్క్ నగరంలో ఎనిమిదేళ్ల బాలికతో సహా తొమ్మిది మంది మరణించారని చెప్పారు.
తాజావార్తలు
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
ట్రెండింగ్
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?