Site icon NTV Telugu

Jharkhand : జార్ఖండ్ రాష్ట్రంలో ఘోరం.. విద్యుత్ షాక్‎తో ఆరుగురి మృతి

Dhanbad

Dhanbad

Jharkhand : జార్ఖండ్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ధన్‌బాద్, గోమోహ్ మధ్య నిచిత్‌పూర్ సమీపంలో 25వేల వోల్ట్ కరెంటు వైర్‌ తగలడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. విద్యుత్ తీగకు తగిలి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. హైటెన్షన్ వైర్ కావడంతో శరీరం చాలా వరకు కాలిపోయింది. ఈ ఘటనతో ఈ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పు మధ్య రైల్వేలోని ధన్ బాద్ డివిజన్ పరిధిలో గల నిచిత్ పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద విద్యుత్ స్థంభాన్ని ఏర్పాటు చేసే సమయంలో బాధితులు విద్యుత్ షాక్ కు గురి అయ్యారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ధన్‌బాద్ రైల్వే డివిజన్‌లోని ప్రధాన్‌ఖాంట నుంచి బంధువా వరకు దాదాపు 200 కి.మీ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 120 నుండి 160 కి.మీలకు పెంచే పనులు జరుగుతున్నాయి.

Read Also: Chittoor: తిరుమల ఘాట్ రోడ్డుపై మరో ప్రమాదం..14 మందికి గాయాలు..

సోమవారం రైల్వే టీఆర్‌డీ విభాగం తరఫున నిచిత్‌పూర్‌ హాల్ట్‌ రైలు గేటు సమీపంలో స్తంభం ఏర్పాటు పనులు చేపట్టారు. ఇలాంటి పనులు మొదలు పెట్టాలంటే కాంట్రాక్టర్ ఆ చుట్టు ప్రక్కల నిషేధ బోర్డు అమర్చాలి. అలాగే క్రేన్ సహాయంతో పనులు చేయించాలి. కానీ కాంట్రాక్టర్‌ అనుమతి లేకుండానే కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయిస్తున్నాడు. కూలీలు స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా స్తంభం 25 వేల వోల్టుల హైటెన్షన్ ఓవర్ హెడ్ వైర్ వైపు వాలింది. అదుపు చేసే క్రమంలో స్తంభం హైటెన్షన్‌ వైరుకు తగలడంతో కరెంట్‌ షాక్ తో ఐదుగురు స్పాట్లోనే మృతి చెందారు. ఘటన అనంతరం తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్‌ఎం కమల్‌ కిషోర్‌ సిన్హా ఆరుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read Also: Errabelli Dayakar Rao : అభివృద్ధిని చూసి కుళ్లుకుంటున్నాయి : మంత్రి ఎర్రబెల్లి

Exit mobile version